పోలీస్ అధికారులతో సీపీ సమీక్ష
NZB: మూడవ విడత ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారులతో NZB CP సాయి చైతన్య సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్మూర్ ACP కార్యాలయంలో సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని అన్నారు.