రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

CTR: పుంగనూరు మండలం బైరా మంగళం వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వనమలదీన్నె పంచాయతీ ఓబిరెడ్డిపల్లెకు చెందిన మోహన, బాలాజీ పుంగనూరులో కూలీ పనులు ముగించుకుని బైకుపై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో బైకు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఇద్దరూ త్రీవంగా గాయపడ్డారు. స్థానికులు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.