కాకాణిని పరామర్శించిన జిల్లా వైసీపీ నేతలు

NLR: ఇటీవల జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మంగళవారం నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో విజయ డైరీ ఛైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి నాయకులు స్వర్ణ వెంకయ్య, పాశం శ్రీనివాస్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. అనంతరం వారు జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.