VIDEO: వేములవాడలో గోశాలను పరిశీలించిన ఈవో
SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం గోశాలను నూతన ఇంఛార్జ్ ఈవో అంజనారెడ్డి సోమవారం పరిశీలించారు. ఇటీవల నాలుగు కోడెలు మృతి చెందిన నేపథ్యంలో ఈ తనిఖీ చేపట్టారు. కోడెలకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. కోడె మొక్కుల ద్వారా ఆలయానికి గణనీయమైన ఆదాయం వస్తుందని తెలిపారు.