జేఏసీ నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత
WNP: ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మెగా రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. వనపర్తి ఆర్టీసీ జేఏసీ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను వివరించారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.