VIDEO: 'సమాచారం లేకుండా ఖాళీ చేయించడం అన్యాయం'
KDP: మదనపల్లెలో రోడ్ల వెడల్పు పేరుతో వీధి వ్యాపారులను ఖాళీ చేయించడంపై వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ గురువారం తీవ్రంగా స్పందించారు. ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించడం అన్యాయమని, వారికి ప్రత్యామ్నాయం చూపకపోవడం ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. రైతులకు, చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.