విశాఖ తీరంలో తూర్పు నౌకాదళం సన్నద్ధం

VSP: విశాఖలో తూర్పు నౌకాదళం త్వరలో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్టు నేవీ అధికారులు మంగళవారం తెలిపారు. విపత్తు నిర్వహణ విభాగంతో కలిసి ఈ డ్రిల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా, తూర్పు నౌకాదళం ఇప్పటికే సముద్ర జలాల్లో 'సన్ రైజ్ ఫ్లీట్' పేరుతో విన్యాసాలు చేస్తోంది.