స్ప్లింకర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

స్ప్లింకర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామంలో రైతులకు స్ప్లింకర్లను ఎమ్మెల్యే వంశీకృష్ణ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అన్నారు.