పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

KRNL: ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పట్టణంలోని గాంధీ సర్కిల్, షరాఫ్ బజార్, లక్ష్మీపేట ప్రాంతంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను సోమవారం తెల్లవారుజామున పరిశీలించారు.ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ..పట్టణంలో ఎక్కడకూడా పారిశుద్ధ్య సమస్య లేకుండా కార్మికులు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రజల ఆరోగ్య సంరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు.