అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం

KMR: అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం చేసుకున్నట్లు గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపారు. కామారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ స్టేజి వద్ద పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారు. కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా 48 బీరు సీసాలతో పాటు నాలుగు లీటర్ల విస్కీని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు మద్యం తరలించిన చర్యలు తప్పవని హెచ్చరించారు.