అవకాడో విత్తనంపై ‘భరతమాత’

NDL: ఆళ్లగడ్డకు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు విజయ్ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా వినూత్న ఆలోచనతో అవకాడో విత్తనంపై భరతమాత సూక్ష్మచిత్రాన్ని పలు రంగులతో చిత్రించారు. సన్నని విత్తనంపై అద్భుతమైన ఆకృతులు, సున్నితమైన రంగుల సమ్మేళనంతో తీర్చిదిద్దారు. ఈ కళతో తన ప్రతిభను మరొకసారి చాటుకున్నారు.