విద్యార్థినిని సత్కరించిన ఎమ్మెల్యే

BPT: వేటపాలెం మండలం పందిళ్ళపల్లి హైస్కూల్‌కు చెందిన సజ్జ దివ్యశ్రీ ఇటీవల విడుదలైన పదోవ తరగతి పరీక్ష ఫలితాలలో 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించిన నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే కొండయ్య ఆ బాలికను సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే కొనియాడారు.