కోతుల బెడద తీరుస్తా.. బాండ్ పేపర్‌తో ప్రచారం

కోతుల బెడద తీరుస్తా.. బాండ్ పేపర్‌తో ప్రచారం

NZB: సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో బాండ్ పేపర్ ట్రెండ్ కొనసాగుతుంది. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ సిరికొండలో సర్పంచ్ అభ్యర్తి ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ప్రయత్నించారు. ఓటర్లు తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో కోతుల బెడద తొలగిస్తానని సిరికొండ సర్పంచ్ అభ్యర్థి గంగాధర్ బాండ్ పేపర్ రాసి గ్రామంలో ప్రచారం చేశారు. కోతుల బెడదతో రైతులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గెలవగానే కోతుల సమస్య పరిష్కరిస్తానని తెలిపారు.