టీజీజీడీఏ-కేఎంసీ ఎన్నిక ఏకగ్రీవం

టీజీజీడీఏ-కేఎంసీ ఎన్నిక ఏకగ్రీవం

WGL: టీజీజీడీఏ (మోడ్రన్ మెడిసిన్) కాకతీయ మెడికల్ కళాశాల యూనిట్ 2026–2028 ఎన్నికల్లో అధ్యక్షుడిగా డా.అంబి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా డా. బి. చిన్నికృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్యుల సమస్యల పరిష్కారం, సేవల మెరుగుదల కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. సభ్యుల సహకారంతో సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.