తీర ప్రాంతాల్లో యువత అప్రమత్తంగా ఉండాలి..!
ASR: జిల్లాలోని తీర ప్రాంతాలు, జలపాతాల వద్ద పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. గణాంకాల ప్రకారం జిల్లాలో ఏటా సగటున 100 మంది జలప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. మృతులలో అత్యధికులు యువత కావడం విషాదమన్నారు. ముఖ్యమైన తీరాల్లో పోలీసులు, ఈతగాళ్లు ఉంటున్నారు. వీరిని సంప్రదిస్తే స్థానికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతారు.