ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరి అరెస్ట్

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరి అరెస్ట్

NLG: ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు DSP శివరాం రెడ్డి ఇవాళ తెలిపారు. NLG కోర్టులో క్లర్క్‌గా పనిచేస్తున్న నసీర్, JR న్యాయవాదిగా పనిచేస్తున్న జ్యోతి నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి వారి దగ్గర డబ్బులు వసూలు చేశారన్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.