ఆరు గ్యారెంటీల అమలు విఫలమైంది: బీఆర్ఎస్ నాయకులు

ఆరు గ్యారెంటీల అమలు విఫలమైంది: బీఆర్ఎస్ నాయకులు

మెదక్: ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలరాజు, గ్రామ అధ్యక్షుడు యాదగిరి పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మిరుదొడ్డి మండలం కాసులాబాద్‌లో అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.