VIDEO: పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన
SRPT: తుంగతుర్తి మండలం సంగెంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య ఆధ్వర్యంలో పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఆదివారం ఖాళీ సిలిండర్లతో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై ధరల భారం మోపుతూ జేబులు కొల్లగొడుతోందని విమర్శించారు. నిత్యావసరాల ధరలను అదుపులోకి తెచ్చి పేదలను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు నినదించారు.