విద్యార్థుల సంక్షేమపై సమీక్ష సమావేశం
ATP: అనంతపురంలోని బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు, పథకాలు, విద్యార్థుల సంక్షేమంపై శనివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న వసతి గృహాలలో సౌకర్యాలు, భోజన నాణ్యత, విద్యార్థులు పోటీ దృక్పథం పెంపొందించడానికి ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.