TG-TET: ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?
TG: టీజీటెట్ జనవరి-2026 దరఖాస్తుల స్వీకరణ గడువు నిన్నటితో ముగిసింది. ఈ పరీక్షకు మొత్తం రెండు పేపర్లకు కలిపి 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. పేపర్-1కు 85,538 మంది, పేపర్-2కు 1,52,216 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు జనవరి 3 నుంచి 31 వరకు జరగనున్నాయి.