వీరయ్య చౌదరి హత్యను ఖండించిన మంత్రి గొట్టిపాటి

వీరయ్య చౌదరి హత్యను ఖండించిన మంత్రి గొట్టిపాటి

ప్రకాశం: ఒంగోలులో మంగళవారం సాయంత్రం టీడీపీ అధికార ప్రతినిధి, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి గొట్టిపాటి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం అమరావతి నుంచి హుటాహుటిన ఒంగోలుకు మంత్రి బయలుదేరారు.