594 కిలోల గంజాయి ధ్వంసం
W.G: జిల్లాలోని వివిధ స్టేషన్లలో పట్టుబడ్డ గంజాయిని ధ్వంసం చేసినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గుంటూరు జిల్లా కొండవీడు పరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ వద్ద ఈ ప్రక్రియ నిర్వహించామన్నారు. మొత్తం 21 కేసులకు సంబంధించిన 594.844 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. ఇందుకు కృషిచేసిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.