సింహాచలంలో శ్రావణ శుక్రవారం పూజలు

సింహాచలంలో శ్రావణ శుక్రవారం పూజలు

VSP: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాస శుక్రవారం పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. సింహవల్లి తాయారు సన్నిధిలో ఆలయ అర్చకులు లక్ష్మీ పూజ అత్యంత వైభవంగా చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. వేద పండితులు భక్తులకు ఆశీర్వచనం అందజేసి ప్రసాదాలు అందించారు.