పొన్నూరులో వైసీపీ కీలక నేతపై కేసు నమోదు

పొన్నూరులో వైసీపీ కీలక నేతపై కేసు నమోదు

GNTR: పొన్నూరు వైసీపీ ఇంఛార్జ్ అంబటి మురళికి గట్టి షాక్ తగిలింది. ఆయనపై పొన్నూరు పోలీస్ స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. ఇటీవల అమరావతి వల్లే పొన్నూరు పొలాలు మునిగాయని మురళి ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అప్పాపురం కాలువ ఏఈఈ ఫిర్యాదు చేశారు. విపత్తుల పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మురళిపై పోలీసులు కేసు నమోదు చేశారు.