పూర్తిస్థాయిలో వైద్యుల నియామకానికి కృషి

AKP: ఎలమంచిలి నియోజకవర్గం పరిధిలోగల అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులను నియమించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఎలమంచిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే హాస్పిటల్స్‌లో మౌలిక వసతి సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.