100 జిల్లాల్లో 'జీరో ఫటాలిటీ జోన్లు'
దేశవ్యాప్తంగా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న 100 జిల్లాలను కేంద్రం గుర్తించింది. ఆయా ప్రాంతాలను 'జీరో ఫటాలిటీ జోన్లు'గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్కడ ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు బ్లాక్ స్పాట్లను తొలగించనున్నారు. పాయింట్ బేస్డ్ సిస్టమ్ ద్వారా ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుని, మరణాల సంఖ్యను తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం.