VIDEO: 'వ్యక్తిగత పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం'
NDL: ప్రతీ విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని ఎంపీడీవో మహమ్మద్ దౌల పేర్కొన్నారు. శనివారం మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. పాఠశాల ఆవరణాన్ని వారు పరిశుభ్రపరిచారు. అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.