ఖాజీపేట నాగ నాదీశ్వర కొండపై పోటెత్తిన భక్తులు
KDP: ఖాజీపేట మండలంలోని నాగ నాదీశ్వర కొండ పై మూడవ సోమవారం పరమేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇందులో భాగంగా కొండకు వచ్చిన భక్తులు గర్భాలయంలో స్వయంభుగా వెలసిన శివలింగానికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. అనంతరం శివపార్వతుల కళ్యాణం వీక్షించి, తర్వాత భక్తులను బండలాగుడు పోటీలు అలరించాయి.