ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్ని నామినేషన్లు అంటే..?
WGL: పంచాయతీ ఎన్నికల మొదటి రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 467, వార్డు స్థానాలకు 238 నామినేషన్లు దాఖలయ్యాయి. వరంగల్‌లో 101, హనుమకొండలో 86, జనగామలో 108, మహబూబాబాద్‌లో 105, భూపాలపల్లిలో 45, ములుగులో 22 సర్పంచ్ నామినేషన్లు వచ్చాయి. మొదటి రోజే భారీ సంఖ్యలో నామినేషన్లు రావడంతో ఎన్నికల సందడి మొదలైంది.