ప్రమాద బీమా చెక్కు అందజేసిన మంత్రి

ప్రమాద బీమా చెక్కు అందజేసిన మంత్రి

ELR: చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామానికి చెందిన చిన్నం కృష్ణయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.