జనసేన ఎంపీలకు పవన్ కీలక సూచనలు
AP: జనసేన పార్టీకి చెందిన ఎంపీలు బాలశౌరి, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌తో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ దిశానిర్దేశం చేశారు. దేశ ప్రయోజనాలను కేంద్రీకరించిన చర్చల్లో సక్రమంగా పాల్గొనడానికి ముందస్తు సన్నాహాలు చేయాలని ఆయన సూచించారు.