పొన్నూరు–తిరుపతి కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం

పొన్నూరు–తిరుపతి కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం

GNTR: పొన్నూరు APSRTC డిపో నుంచి తిరుపతి వరకు కొత్త బస్సు సర్వీస్‌ను పొన్నూరు ఎమ్మెల్యే, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డిపో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఇది పొన్నూరు ప్రజల చిరకాల కోరిక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మార్కండేయ బాబు పాల్గొన్నారు.