గుంతకల్లులో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి: DYFI

ATP: గుంతకల్లులో మూతబడిన స్పిన్నింగ్ మిల్ స్థానంలో ప్రత్యామ్నాయంగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి సురేంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని హంపిరెడ్డి భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంతకల్లులో పరిశ్రమలు లేక నిరుద్యోగ యువత ఉపాధి కోసం వలసలకు వెళుతున్నారని పేర్కొన్నారు.