రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి
VSP: మధురవాడ సమీపంలో శివశక్తి నగర్లో రోడ్డు మీద కాంక్రీట్ మిల్లర్‌ను ఢీకొనడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్కూటీపై వస్తుండగా అదుపుతప్పి మిల్లర్‌ను ఢీకొన్నారు. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా రహదారి అంతా ఆక్రమణల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.