వార్డు సభ్యులకు అధికారుల శిక్షణ కార్యక్రమం

వార్డు సభ్యులకు అధికారుల శిక్షణ కార్యక్రమం

NRML: లక్ష్మణచందా మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలో ఇటీవలి ఎన్నికైన నూతన వార్డు సభ్యులకు సోమవారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా పలువురు అధికారులు, వార్డు మెంబర్ల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. అధికారులు మాట్లాడుతూ.. వార్డు మెంబర్లు అందరూ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.