'ఎకో పార్కులో పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టాలి'
కడప మున్సిపల్ కమిషనర్ రాకేశ్ చంద్ర శుక్రవారం పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ తీరును పరిశీలించారు. ఉక్కాయిపల్లి, పుట్లంపల్లి కేంద్రాలతో పాటు సీ&డీ ప్లాంట్‌ను తనిఖీ చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎకో పార్కులో పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టాలని పబ్లిక్ హెల్త్, ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.