చెట్టును ఢీకొట్టిన కారు.. పలువురికి తీవ్ర గాయాలు

చెట్టును ఢీకొట్టిన కారు.. పలువురికి తీవ్ర గాయాలు

RR: చేవెళ్ల బీజాపూర్- హైదరాబాద్ జాతీయ రహదారిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మొయినాబాద్ మండల పరిధిలోని తాజ్ సర్కిల్ వద్ద హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టుని ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అందులో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.