అభివృద్ధి పనులపై రైతుల ఎక్స్‌పోజర్ విజిట్
SRD: సిర్గాపూర్ మండలం వాసర్ వాటర్ షెడ్ పరిధిలోని రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా చిన్న లక్ష్మాపూర్ గ్రామాన్ని సందర్శించారు. వాటర్ షెడ్ సీఈవో చంద్రశేఖర్, సర్పంచ్ హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎక్స్‌పోజర్ విజిట్‌లో.. అక్కడ చేపట్టిన NRM, TCB, SCT, MPT వంటి నీటి సంరక్షణ పనులను, ప్లాంటేషన్ పద్ధతులను రైతులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవగాహన పెంచుకున్నారు.