పరకాలలో బీజేపీ కార్యకర్తల నిరసన
HNK: పరకాల పట్టణంలో బీజేపీ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం ఎదుట నేడు నిరసన చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ పరకాల నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని వారు ఆరోపించారు. పరకాల అభివృద్ధిని రెండు పార్టీలు విస్మరించాయని, పదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి కనిపించలేదని పేర్కొన్నారు. పరకాలపై తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.