ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

ATP: అనంతపురం టవర్ క్లాక్ సమీపంలోని పాత ఆర్డీవో కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ ఆనంద్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్‌లో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాల భద్రతను ఆయన పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, సీసీ కెమెరాల పనితీరుపై అధికారులను ఆరా తీశారు.