VIDEO: ఉప ఎన్నిక పోలింగ్‌పై ఎస్పీ పర్యవేక్షణ
MBNR: మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఉప ఎన్నిక పోలింగ్‌ను ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ ఇవాళ పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఐ రామలాల్, ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.