ప్రేమమూర్తి సాయిబాబా: ఉపరాష్ట్రపతి
AP: శ్రీ సత్యసాయిబాబా సేవలను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కొనియాడారు. పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు హాజరైన ఉపరాష్ట్రపతి.. సేవామార్గానికి సత్యసాయి ప్రతిరూపంగా నిలిచారన్నారు. మానవసేవే మాధవసేవ అని నమ్మడమే కాకుండా ఆచరించి చూపారన్నారు. ప్రపంచమంతా ప్రేమను పంచిన ప్రేమమూర్తి సాయిబాబా అని తెలిపారు.