టోల్‌గేట్ వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు.!
SKLM: నరసన్నపేట మండలం మడపాం టోల్‌గేట్ ప్లాజా వద్ద పలు వాహనాలను పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోమవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో రాకపోకలు కొనసాగిస్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు. సీఐ ఎం శ్రీనివాసరావు, ఎస్సై సీహెచ్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ఎస్పీ అత్యవసరంగా ఆదేశాలు ఇవ్వడంతో ఈ తనిఖీలను చేపడుతున్నామని వివరించారు.