'ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు'
KNR: 'ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు' అనే నినాదంతో డ్రగ్స్, గంజాయి వాడకంపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో KNRలోని తెలంగాణ చౌక్ వద్ద కళా ప్రదర్శన జరిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సాంస్కృతిక సలహా మండలి సభ్యులు పల్లె నర్సింహా నిర్వహించారు.