సర్పంచ్ లావణ్యకు ఘన సన్మానం
ASR: రావికమతం మండలం మరుపాక పంచాయతీ సర్పంచ్ పండూరి లావణ్యను గురువారం సిబ్బంది, గ్రామ ప్రజలు ఘనంగా సత్కరించారు. గత ఐదేళ్లలో గ్రామాభివృద్ధికి విశేష సేవలు అందించారని అభినందించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు లావణ్య తెలిపారు. గ్రామ పురోగతికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.