నందిగామలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
కృష్ణా: నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఏసీపీ తిలక్ రౌడీ షీటర్లను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. వారు సత్ప్రవర్తనతో మెలగాలని, సమాజంలో మార్పు చెంది మంచిగా జీవించాలని సూచించారు. ఎటువంటి గొడవలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ వైవీఎల్ నాయుడు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.