పదోన్నతి పొందిన నలుగురు ఉద్యోగులు సన్మానం

పదోన్నతి పొందిన నలుగురు ఉద్యోగులు సన్మానం

ELR: ఉంగుటూరు మండలం నుంచి నలుగురు డిప్యూటీ ఎంపీడీవోగా ( సచివాలయాల ) పదోన్నతి పై వెళ్లిన ఉద్యోగులకు సన్మానం చేశారు. శుక్రవారం ఈ సన్మాన కార్యక్రమం ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, ఎంపీడీవో మనోజ్, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు వారికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ.. మీ ఆదరాభిమానాలతోనే పదోన్నతి లభించిందన్నారు.