ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
VZM: ఎముకలు బలంగా ఉండాలంటే.. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలని ప్రముఖ వైద్యులు, ఎముకల కీళ్ల వ్యాధుల నిపుణులు డాక్టర్ జివిఎన్ భూపతి పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ ఆధ్వర్యంలో కాళీ ఘాట్ కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. సుమారు 300మంది ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు.