వేం నరేందర్ రెడ్డిని కలిసిన వెన్నం శ్రీకాంత్ రెడ్డి
MHBD: కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవ ఎన్నికకానున్న వేం నరేందర్ రెడ్డిని శనివారం టీపీసీసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాకు మెగా రైల్వే మెయింటినెన్స్ డిపో పూర్తిస్థాయిలో వచ్చే విధంగా కృషి చేయాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.