ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిది

NDL: పాములపాడు మండలంలో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి నాలుగు లక్షల రూపాయలు చెక్కును మంద లక్ష్మమ్మ అనే మహిళకు ఎమ్మెల్యే జయ సూర్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య ఖర్చులకు డబ్బు లేక ఇబ్బంది పడే వారికి సీఎం సహాయనిది ఎంతో చేయూతనిస్తుందని తెలిపారు.